- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మూడు రంగుల మువ్వెన్నల జెండాను తహశీల్దార్ రవికుమార్ ఆవిష్కరించారు. కొయ్యుర్ పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు, డిటి బాబా, వార్డు సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -



