Saturday, August 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్నూర్ ఎంపీడీవోగా పి. సాయిలు బాధ్యతలు

మద్నూర్ ఎంపీడీవోగా పి. సాయిలు బాధ్యతలు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్: మద్నూర్ మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిగా (ఎంపీడీవో) పి. సాయిలు బాధ్యతలు స్వీకరించారు. వేల్పూర్ మండలంలో విధులు నిర్వహించిన ఆయన పదోన్నతిపై మద్నూర్ ఎంపీడీవోగా నియమితులయ్యారు. ఇప్పటివరకు మద్నూర్ ఇన్‌చార్జి ఎంపీడీవోగా విధులు నిర్వహించిన సత్యనారాయణరెడ్డి నుంచి స్వాతంత్ర్య దినోత్సవం రోజున పి. సాయిలు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కార్యాలయంలో నూతన ఎంపీడీవో పి. సాయిలు జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది నూతన ఎంపీడీవోకు అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -