Monday, August 17, 2026
E-PAPER
Homeదర్వాజపెందోట జాతీయ సాహిత్య పురస్కారాలు 2026

పెందోట జాతీయ సాహిత్య పురస్కారాలు 2026

- Advertisement -

పెందోట జాతీయ సాహిత్య పురస్కారాలు 2026 ఈ నెల 23 ఉదయం 9.30 గంటలకు ప్రెస్ క్లబ్ సిద్దిపేటలో జరుగును. పురస్కార గ్రహీతలు శ్రీమతి జొన్నలగడ్డ శ్యామల, శ్రీ ఫిజిక్స్ అరుణ్ కుమార్, శ్రీ వంగరి వెంకటేశం, కుమారి జంపాల కావ్య శ్రీ, కుమారి నూనె శ్రీనిధి, చి. బి విశ్వతేజ, చి. గార్లపాటి కృష్ణ మనోహర్. ఇదే కార్యక్రమంలో శ్రీవాణి సాహిత్య పరిషత్ 12వ వార్షికోత్సవం జరుగుతుంది. ఆచార్య మట్ట సంపత్ కుమార్ రెడ్డి, ఎస్ మహేందర్, మాడుగుల మురళీధర శర్మ, ఉండ్రాళ్ల రాజేష్, మతి ఇప్ప ఉమారాణి, బైతి దుర్గయ్య, శ్రీమతి వురిమల్ల సునంద, ప్రవీణ్ కుమార్ శర్మ, కొమ్మవరపు కృష్ణయ్య పాల్గొంటారు. – పెందోట వెంకటేశ్వర్లు, 9440524546.

అట్టాడ అప్పలనాయుడు వ్యాససంపుటి ‘తంపర’ ఆవిష్కరణ
శ్రీకాకుళ సాహితి, సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో రచయిత అట్టాడ అప్పల్నాయుడు సాహిత్య సామాజిక వ్యాస సంపుటి ‘తంపర’ ఆవిష్కరణ ఆగష్టు 23 ఉదయం 10గంటలకు శ్రీకాకుళం జిల్లా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ భవనంలో జరగనుంది. ఇదే కార్యక్రమంలో శిరంశెట్టి కాంతారావు & గంటేడ‌ గౌరునాయుడు సామూహిక రచన ‘ఎన్నో ఉదయాలు-రెండు హృదయాలు’ ఆవిష్కరణ ఉంది. ఈ కార్యక్రమంలో శిరంశెట్టి కాంతారావు, గంటేడ గౌరునాయుడు, చిగురుపల్లి ప్రభాకరరావు, చీకటి దివాకర్, డాక్టర్. సుధీర్, ఉదయ్ కిరణ్, దాసరి రామచంద్రరావు, బాడాన శ్యామలరావు, కంచరాన భుజంగరావు తదితరులు హాజరౌతారు. – చంపావతి

పుస్తకావిష్కరణ – కథల పోటీ బహుమతి ప్రదానం
సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ, హైదరాబాదులో ఈ నెల 23 సాయంత్రం 4.45 గం.లకు డా. అమృతలత తెలుగులో రచించిన ‘నా ఏకాంత బృందగానం’ సచిత్ర స్వీయ జీవితకథకు పీసపాటి శ్రీరామ మూర్తి గారి ఆంగ్ల అనువాదం ‘మై సోలిటరీ కోరస్’, విజయాకిషన్ రెడ్డి రచించిన కవితా సంపుటి ‘మానస సంచరరే’ పుస్తకాల ఆవిష్కరణ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి డా. నందిని సిధారెడ్డి, ఏ ఎస్ లక్ష్మి, నెల్లుట్ల రమాదేవి హాజరవుతారు. ఇదే వేదికపై డా. అమృతలత; మయూఖ, తరుణి అంతర్జాల పత్రికా సంపాదకులు డా.కొండపల్లి నీహారిణి సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీలో గెలుపొందిన కథకులకు అతిథులచే బహుమతి ప్రదానం వుంటుంది. ఎంపిక చేసిన కథలతో కూడిన ‘అమృత మయూఖం’ కథాసంకలనాన్ని ముఖ్య అతిథి ఆవిష్కరిస్తారు.
డా. అమృతలత, డా.కొండపల్లి నీహారిణి, నెల్లుట్ల రమాదేవి

మెర్సీ మార్గరెట్ కవితలతో ఓ సాయంత్రం
మరువం (మాటల వేదిక), లామకాస్ లు కలిసి సమర్పిస్తున్న ‘ధ్వని’ (శ్రవ్య- రూప ప్రదర్శన) – 7వ కార్యక్రమం ఈ నెల 21 సాయంత్రం 6 గం.ల 15 ని.ల నుండి లామకాన్, GVK మాల్ ఎదురు సందులో, రోడ్ నెం.1, బంజారా హిల్స్, హైదరాబాద్‌‌లో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇంతవరకు పుస్తక రూపంలో రాని, ఎక్కువగా ఇటీవలి కాలంలో రచించిన మెర్సీ మార్కెట్ విలక్షణ కవితలు ముఖ్యంగా ప్రేమ కవితలను శ్రవ్య-రూప ప్రదర్శనా రీతిలో వినూత్న శైలిలో ఒక నిండైన అనుభవంగా అందిస్తున్నాం. కార్య్రకమంలో చివరలో మెర్సీ మార్గరెట్ తో ప్రేక్షక-శ్రోతల సంవాదం, ప్రశ్నలు- జవాబులు వుంటాయి.

గిరిజన కథల సంపుటికి రచనల ఆహ్వానం
గిరిజన జీవన విధానం, వారి సంస్కృతి, ఆచార వ్యవహారాలు, భాష సామాజిక పోరాటాలను ప్రతిబింబించే కథలతో ఒక ‘ గిరిజన కథల సంపుటి’ ని ప్రత్యేకంగా తీసుకురావాలని తలపెట్టాము. గిరిజన జీవనాన్ని సజీవంగా చిత్రీకరించే ఔత్సాహిక రచయితల నుండి కథలను ఆహ్వానిస్తున్నాము. కథలను పంపవలసిన వాట్సాప్ నంబర్లు: ​6305584064, 94413 35123. లేదా ఈ మెయిల్ [email protected] . – డి. సాయినాథ్ రెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్

జొన్నవిత్తులవారి సాహిత్య స్ఫూర్తి పురస్కారం
జొన్నవిత్తుల రామకృష్ణ శర్మ, వారి శ్రీమతి కీశే లక్ష్మీనరసమ్మగారల సంస్మరణార్థం వారి కుమారులు జొన్నవిత్తులవారి సాహిత్య స్ఫూర్తి పురస్కారాన్ని ఇవ్వాలని సంకల్పించారు. ఈ పురస్కారాన్ని సెప్టెంబరు 6న యువ సాహితీవేత్త సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్రీ పరిమి శ్రీరామనాథ్ గారికి అందిస్తున్నారు. – జొన్నవిత్తుల శ్రీరామచంద్ర మూర్తి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -