Monday, August 17, 2026
E-PAPER
Homeదర్వాజచెరసాల

చెరసాల

- Advertisement -

నేల ఈనెలకై జగడాలు
నీటి అలలపై నిర్బంధాలు
ఆకాశ ఆవృతాలపై అభ్యంతరాలు
ప్రాణవాయువుపై పరిమితులు
అణ్వాయుధాల అడ్డుగోడలు
వెరసి! ప్రపంచమొక పెద్ద చెరశాల
దినదినం ఆమెచుట్టూ
మురికి పేరుకు పోతోంది
క్షణక్షణం ఆమె మెడచుట్టూ
ఉచ్చు! గట్టిగా బిగుసుకుంటోంది
జహాపనాల జవాబుదారీతనం
ఒకప్పుడు ఓటరనే భయముండేది
ఇప్పుడు తోటి వలసదారుడనే
కనీస ఇంగితం కూడా కరువైపోతోంది
నిటారుగా
నిలబడాలని ప్రయత్నించావో
నిచ్చెన పైనుండి జారిపడతావ్!
జాగ్రత్త వంగి వంగి
దండాలు పెట్టకపోతివో
పొగిలి పొగిలి
పొర్లుదండాలు పెట్టాల్సివస్తుంది
ప్రశ్న అనే
జడపదార్థాన్ని ఆశ్రయించావో
అన్యాయంగా అదృశ్యమై పోతావ్!
పరిస్థితి మునుపెన్నడూ లేనంత దిగజారి భీభత్సరస నాటకంతో పరిహసిస్తోంది!
ప్రత్యామ్నాయ పరిష్కారం కోసం
ప్రయత్నించే ఓ సాహసీ..!
ఒక్కొక్క ఊచను ఒదులుచేస్తూ
ప్రతీ నిమిషం ప్రతిఘటిస్తూ
గట్టిగా హత్తుకున్న
హతరాష్ట్ర కౌగిలినుండి
ఆమెను బేషరతుగా విడిపించుకో!!
కరిపె రాజ్ కుమార్, 8125144729

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -