Friday, September 11, 2026
E-PAPER
Homeదర్వాజకామ్రేడ్ ఇదిగో...!

కామ్రేడ్ ఇదిగో…!

- Advertisement -

అతడు
కమ్యూనిస్టు మనిషి!
ముక్కలు, ముక్కలైన చెట్టు కొమ్మ మీది
కమ్యూనిస్టు పక్షులు కూడా,
అతడిని ఇష్టపడతాయి!
కార్యచలన శీలుడు అతడు.
కావలసిన వారికి
రైతు పెద్ద తాత!
మనిషి కరిగి తొలగిపోయి
కామ్రేడ్ అయిండు!
అతడు
ఎర్రజెండా కప్పుకొని
వెళ్లి పోయిండు.
మళ్లీ మరణం లేని
చిగురు ఆకు కోసం!
సారంపల్లి మల్లారెడ్డి
కామ్రేడ్ ఇదిగో…
కవి ఏదో
అక్షరం అల్లి ఇస్తుండు!
కాలం మీద
నీదో సంతకానికి!
నీదో అడుగుజాడ దీపానికి!
జన జ్వాల, 9949163770

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -