- Advertisement -
హృదయంలో ఉదయించిన కొత్త చిగురు
నవ ఇత్తనమై మొలకెత్తి నాంది పలికింది
చిగురించే పూవుల పుప్పొడి పరిమళం
ఎత్తిన గళాలు పట్టిన పిడికిళ్ళు
కదిలినై కడుపులో పేగులు
ఆకలి డొక్కలు
విద్య అభివృద్ధి ఉద్యోగాల ఉద్యమం
పోలీసు లాఠీలకు పోనీ మరకలా రక్తం
అంటింది నెత్తురు అమ్మ భారతావనికి
చిందిన యువకుల రుద్దిరం
చిగురించే కొత్త ఉదయ హృదయాలు
అంబేద్కర్ పుట్టిన అవనిపై
బుద్ధుని పాద ముద్రల నేలన
బొద్దింకల నెత్తురు
రామ రాజ్యములో రక్తపాతమా..?
మహాత్మా గాంధీ మార్గం హింసా..?
దేవరపాగ కృష్ణయ్య 9963449579
- Advertisement -


