ఎన్ని గుళ్ళు పేల్చినా
ఆ పక్షులు చెట్టు వదల్లేదు
పోరాటం పట్టు వీడలేదు
ప్రశ్నించడం ఆపలేదు
ప్రజాస్వామ్యం గొంతై కూస్తూనే ఉన్నాయ్
అన్యాయానికి ఎదురునిల్చి నినదిస్తూనే ఉన్నాయ్
చివరికి ఢిల్లీయే కాదు
గల్లీ గల్లీలో దేశం తెల్లబోయింది
యువతే భవితని తేలిపోయింది
పండిన తలలు చప్పున తప్పులు
దిద్దుకోడానికి బదులు తప్పని
వేళ్ళు చూపినా నిజం నిప్పులా తేలిపోయింది
దమనకాండ కురిపిస్తున్నా
గాయాల్లో తడిసాయే తప్ప శ్రుతి తప్పలేదు
కదనోత్సాహం ప్రజాస్వామ్యాన్ని గెలిపించింది
రాజ్యాంగాన్ని కాపు కాచింది
కొత్త పోరాటాలకు ఊపిర్లు పోసింది
ప్రశ్నల కణకణలు ఆరేవికావని
ఉసిగొల్పిన చీకటి తలదించుకొని వెళ్ళిపోయింది
నిన్న ఆ చెట్టు కేవలం పర్యాటక స్థలమే
నేడు నెత్తుటి ఉద్యమాన్ని కన్న పేగు
రేపు తూరుపుకొండల్లో కొత్త సూర్యోదయాలకు
ఆరని జ్యోతై వెలిగే బండ గురుతు..!
భీమవరపు పురుషోత్తమ్, 9949800253
వెలుగుల ప్రవాహం
- Advertisement -
- Advertisement -


