తెలంగాణ సాహితి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కే.ఆనందాచారి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలుగు సాహిత్యంలో బహుముఖ ప్రజ్క్షాశాలి తంగిరాల చక్రవర్తి అని తెలంగాణ సాహితి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, నవతెలంగాణ బుక్ హౌస్ ఎడిటర్ కే.ఆనందాచారి అన్నారు. తంగిరాల మొదటి వర్దంతి సభ ఆదివారం హైదరాబాద్‌లోని ఎంహెచ్ భవన్‌లో తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను నెమరుకేసుకున్న సన్నిహితులు, మిత్రులు, సాహితీ ప్రియులు ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆనందాచారి మాట్లాడుతూ తంగిరాల కథలు, కావ్యాల నుంచి నాటకాల వరకు 30కి పైగా పుస్తకాలు రాశారని అన్నారు. వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చివరి వరకు కమ్యూనిస్టుగా నిరాడంబరంగా జీవించారని కొనియాడారు. ప్రజాశక్తి, నవతెలంగాణ బుక్ హౌస్ విభాగాల్లో నిబద్ధతతో పని చేశారని కొనియాడారు. సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లో విస్తృత అధ్యయనం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితివేత్త, కథకులు కూర చిదంబరం, సాహితి కిరణం సంపాదకులు పొత్తూరి సుబ్బారావు, తెలంగాణ సాహితి రాష్ర్ట కోశాధికారి అనంతోజు మోహన కృష్ణ, సహాయ కార్యదర్శి ఎస్‌కే.సలీమా, నవతెలంగాణ బోర్డు సభ్యులు బీవీఎస్.పద్మరాజు, కే.నరహరి తదితరులు పాల్గొన్నారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి ‘తంగిరాల’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



