Monday, August 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసాగునీటి కోసం బచ్చన్నపేట
 రైతుల మహా ధర్నా

సాగునీటి కోసం బచ్చన్నపేట
 రైతుల మహా ధర్నా

- Advertisement -


గోదావరి జలాలు అందించాలని డిమాండ్
నవతెలంగాణ – బచ్చన్నపేట

పొలాల్లో పచ్చని పంటలు కళకళలాడాల్సిన వేళ, సాగునీరు అందక రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది. గోదావరి జలాలు మండలానికి చేరకపోవడంతో పంటల సాగు తీవ్రంగా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆదివారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు మహా ధర్నా నిర్వహించారు. వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేయడం కష్టంగా మారిందని, గోదావరి జలాలు అందితే వేలాది ఎకరాలకు సాగునీటి భరోసా లభిస్తుందని రైతులు తెలిపారు. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు విపరీతంగా పెరిగిన తరుణంలో సాగునీరు అందకపోతే తీవ్ర ఆర్థిక నష్టాలు చవిచూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి మళ్లింపులో నిర్లక్ష్యం వహిస్తున్న కొందరి ఇరిగేషన్ అధికారుల తీరుపై రైతులు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చివరి ఆయకట్టు వరకు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో బచ్చన్నపేట ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న ఎస్సై శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని, రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -