మాజీ మంత్రి
సునీతా లక్ష్మా రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సంగారెడ్డి లో ప్రజలను తప్పుదోవ పట్టించేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డి విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులను తిట్టడానికే తెలంగాణ ప్రజాధనం తో సభలు పెడుతున్నారని ఆరోపించారు. బూతులు మాట్లాడటం తప్ప సీఎంకు మరేమీ తెలియదని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో 6.47 లక్షల రేషన్ కార్డులిచ్చారంటూ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శాసన మండలిలో చెబితే సీఎం దానికి భిన్నంగా మాట్లాడటం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఈ రకంగా కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీని తప్పుదోవ పట్టిస్తున్నదని విమర్శించారు.
కేసీఆర్ తీసుకొచ్చిన రైతుబంధు, రుణమాఫీ పథకాలను కూడా సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రాజీవ్ యువవికాసం ఏమైందని ప్రశ్నించారు. స్కాలర్ షిప్, ఫీ రీయింబర్స్ మెంట్ పై మాట తప్పారని విమర్శించారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి క్షుద్ర పూజల గురించి మాట్లాడటం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్, మాణిక్ రావు తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి సభలో సీఎం పచ్చి అబద్ధాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



