Monday, August 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఘోర రోడ్డు ప్రమాదం..12 మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం..12 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హంగేరీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలాండ్ పర్యాటకులతో వెళ్తున్న బస్సు బుడాపెస్ట్‌కు 140 కిలోమీటర్ల దూరంలోని మెజోకెరెష్టెస్‌ సమీపంలో ఎం3 హైవేపై అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 12 మంది మృతి చెందగా, 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్రలోకి జారుకోవడమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 57 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. బస్సులో ఉన్న వారంతా పోలండ్ పౌరులేనని ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -