- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు తన ప్రియురాలిని అతికిరతకంగా హత్య చేశాడు. బాలాపూర్ పరిధిలోని బిస్మిల్లా కాలనీలో నివాసముంటున్న బీహార్‌కు చెందిన రెహానా అనే యువతిని, ఆమె ప్రియుడు మహ్మద్ సలామ్ కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో మూటకట్టి పరారయ్యాడు. తనని పెళ్లి చేసుకోవాలని సదరు యువతి ఒత్తిడి చేయడంతోనే సలామ్ ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -



