Monday, September 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుగోదావరిలో దూకిన పంచాయతీరాజ్ ఏఈ కుటుంబం

గోదావరిలో దూకిన పంచాయతీరాజ్ ఏఈ కుటుంబం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు కమ్‌ రైలు వంతెనపై నుంచి పిఠాపురానికి చెందిన ఇంజినీర్‌ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరిలోకి దూకినట్లు సమాచారం. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. నలుగురిలో ఒక కుమారుడికి ఈత రావడంతో అతడు నీటి నుంచి బయటపడ్డాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇంజినీర్‌ దంపతులు, మరో కుమారుడి ఆచూకీ కోసం పోలీసులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -