- Advertisement -
నవతెలంగాణ – కోటగిరి: డ్యూటీకి రావాలంటే మద్యం కావాల్సిందే అన్న చందంగా ఓ అధికారి తీరు మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోటగిరి మండలంలోని ఓ మేజర్ గ్రామ పంచాయతీకి చెందిన పంచాయతీ కార్యదర్శి నిత్యం మద్యం మత్తులో విధులు నిర్వహిస్తున్నాడని స్థానికంగా వదంతులు ప్రచారంలో ఉన్నాయి. సదరు అధికారి మద్యం మత్తులో విధులకు హాజరవుతున్నారనే ఆరోపణలతో వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపి, వాస్తవాలు తేల్చి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
- Advertisement -



