Monday, August 17, 2026
E-PAPER
Homeజాతీయంనేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో 50 మందికి పైగా వేటు

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో 50 మందికి పైగా వేటు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: నీట్ పేపర్ లీక్ లతో గుణపాఠం నేర్వని ఎన్టీఏ నీట్ యూజీ -2026 పేపర్ ప్రశ్నాపత్రంలో తీవ్ర నిర్లక్ష్యం బయటపడింది. ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులలో తప్పులు దొర్లాయంటూ పలువురి నుంచి ఫిర్యాదులు అందాయి. దీంతో సర్వత్ర విమర్శలు రావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమతమైంది.నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో 50 మందికి పైగా సిబ్బందిని తొలగించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వీటిలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, టెస్ట్ సెక్యూరిటీ జనరల్ మేనేజర్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అండ్ సైకోమెట్రిక్స్ జనరల్ మేనేజర్ వంటి పోస్టులు ఉండనున్నాయి. సైబర్-సెక్యూరిటీ, సైకోమెట్రిక్స్, ప్రశ్నపత్ర రూపకల్పన, ఇతర ప్రత్యేక రంగాల కోసం NTA ప్రైవేట్ రంగం నుండి డొమైన్ నిపుణులను కూడా తీసుకోనున్నట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -