Tuesday, August 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాల అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం 

గ్రామాల అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం 

- Advertisement -

అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్యాయంతో పని చేయాలి 
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి 
నవతెలంగాణ-మిడ్జిల్ 

గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్పారు. మంగళవారం మండల కేంద్రంలో ఎంపీడీవో సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సర్వసభ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలి అధికారులకు సూచించారు. అనంతరం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల పరిస్థితి, విద్య, వైద్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, వ్యవసాయం తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు.

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ పనులను నాణ్యతా ప్రమాణాలతో, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి  ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు  పనిచేయాలని సూచించారు. మండలంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సర్వసభ సమావేశం దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు నిరంతరం కృషి చేస్తున్నారని  తెలిపారు. కార్యక్రమంలో జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, తహసిల్దార్ రాఘవేందర్ రెడ్డి, ఎంపీడీవో లక్ష్మణ్ రాథోడ్, ఎంపీ ఓ రాజశేఖర్ రెడ్డి, వ్యవసాయ అధికారి సిద్ధార్థ, వివిధ గ్రామాల సర్పంచులు ఎడ్ల శంకర్ ముదిరాజ్, నాగరాజు గౌడ్, శ్రీశైలం యాదవ్, సుజాత, శశికళ, మాధవి, రాములమ్మ, మండల శాఖ అధికారులు అన్ని గ్రామాల సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -