నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో బొమ్మన బోయిన వీరన్న మృతి చెందగా..ఆ కుటుంబాన్ని సందర్శించి పరామర్శించినట్లు మహబూబాద్ మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ తెలిపాడు. మంగళవారం మృతుడు వీరన్న పార్ధవదేహానికి పూలమాలవేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీరన్నది నిరుపేద కుటుంబమని, అతని మృతి గ్రామానికి తీరని లోటు అని అన్నారు. పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశాడని గుర్తు చేశారు. అదేవిధంగా గ్రామాభివృద్ధిలో తన వంతు పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. కుటుంబ సభ్యులు అధైర్య పడొద్దని, కుటుంబాన్ని ఆదుకునేందుకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అవసరమైతే వారి పిల్లల విద్యాభివృద్ధి సహకరిస్తానని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్, ఆ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బొల్లు మురళి, నాయకులు బిక్కు నాయక్ జల్లా సోమయ్య చింతకుంట్ల ఉప్పలయ్య తో పటు జిల్లా మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు.
మృతుడి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



