Wednesday, August 19, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంబంగారు గని కుప్పకూలి..30 మంది మృతి

బంగారు గని కుప్పకూలి..30 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆఫ్రికా ఖండంలోని సెంట్రల్ ఆఫ్రికాన్ రిపబ్లిక్ దేశంలో తీవ్ర విషాదం జరిగింది. అక్కడి నానా మంబేరేలో బంగారు గని కుప్పకూలడంతో 30 మంది కార్మికులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. నానా-మాంబెరే ప్రిఫెక్చర్‌ పరిధిలోని అబ్బా ప్రాంతంలో ఇవాళ ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. టెక్నికల్ నాలెడ్జ్ లేని, సంప్రదాయ పద్ధతుల్లో తవ్వుతున్న ఈ గని ఒక్కసారిగా కూలిపడిందని ప్రమాదం నుంచి బయటపడిన ఫ్లోరియన్ గాగుండే అనే కార్మికుడు తెలిపాడు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని, అయితే వారు సజీవంగా బయటపడే అవకాశాలు క్రమంగా క్షీణిస్తున్నాయని పేర్కొన్నాడు. ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -