- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ :జురాల జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. జూరాల ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 34 వేల క్యూసెక్కులుగా ఉంది. అధికారులు జలవిద్యుత్ ద్వారా 31 క్యూసెక్కులను శ్రీశైలం జలాశయానికి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 318.51 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 318.24 మీటర్లుగా ఉంది. జూరాల ప్రాజెక్ట్ పూర్తి నీటి నిల్వ 9.65 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 9.09 టీఎంసీలుగా ఉంది.
- Advertisement -



