Wednesday, August 19, 2026
E-PAPER
Homeజాతీయండాగ్ స్టెరిలైజేషన్ లో అవినీతి..వినూత్నంగా ఫిర్యాదు

డాగ్ స్టెరిలైజేషన్ లో అవినీతి..వినూత్నంగా ఫిర్యాదు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా కలెక్టరేట్ కార్యాలయంలో కాంగ్రెస్‌నేత దీపక్ ముల్లు రాథోడ్.. వీధికుక్కల స్టెరిలైజేషన్ (కుక్కల సంతానోత్పత్తి నిరోధక ప్రక్రియ) పథకంలో జరిగిన అవినీతిని నిరసిస్తూ వినూత్న రీతిలో ఫిర్యాదు చేశారు. ఒక వ్యక్తికి కుక్క మాస్క్ తొడిగించి ప్రజా విచారణ (Public Hearing) సభకు తీసుకువచ్చారు. గత 4 ఏళ్లలో వీధి కుక్కల స్టెరిలైజేషన్ (కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్) కోసం మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు  రూ.40 లక్షల బడ్జెట్ ఖర్చు చేసింది. అయినా జిల్లాలో కుక్కల సంఖ్య తగ్గకపోగా, కుక్క కాటు కేసులు 13,225 కి పైగా పెరిగాయని ఆరోపించారు. ఆయన చేసిన ఫిర్యాదుపై అధికారులు స్పందించారు. ఆరోపణలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకునేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని అదనపు కలెక్టర్ కాశీరామ్ బడోలే దీపక్ రాథోడ్‌కు హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -