Thursday, August 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్‌పై కేసు నమోదు

మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్‌పై కేసు నమోదు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పౌరసరఫరాల శాఖ ఫిర్యాదుతో మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్ నాయక్‌పై ఖానాపూర్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తనపల్లిలోని ఎఆర్ఎస్ రైస్ మిల్లులో ఆగస్టు 18న విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల తనిఖీల్లో 9,639.962 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యం కొరత బయటపడింది. దీని విలువ సుమారు రూ.40.96 కోట్లుగా అధికారులు తెలిపారు. దీంతో ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీయంఆర్ కూడా భారీగా బకాయి పడింది. ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -