- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హనుమకొండలోని ఎల్కతుర్తి బస్టాండ్ సమీపంలో కొన్ని రోజులుగా నిలిపిఉంచిన కారులో మహిళ మృతదేహం లభ్యమైంది. కారు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు తెలపడంతో వారు వచ్చి చూడగా డిక్కీలో మహిళ మృతదేహం కనిపించింది. మృతురాలు గోదావరిఖనికి చెందిన మానసగా గుర్తించారు. కారును ఆమె స్నేహితుడు వినోద్ అద్దెకు తెచ్చాడని తెలిసింది. కరీంనగర్లో ఉన్నప్పుడు మానసకు ఫిట్స్ వచ్చి మృతి చెందడంతో భయంతో మృతదేహాన్ని కారులో వదిలివెళ్లిపోయినట్లు వినోద్ తెలిపాడు.
- Advertisement -



