కథానాయకుడు అడివి శేష్ నటించిన పాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకాయిట్’. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ఈనెల 10న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరో అడివి శేష్ మీడియాతో ముచ్చటించారు. ‘డెకాయిట్’ తెలుగు ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హిందీలోనూ చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ టైం భోజ్‌పురిలో కూడా ప్రీమియర్ చేస్తారా అని అడిగారు. అది విన్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. పవన్ సింగ్ ఇందులో చేయడం భోజ్‌పురికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నా గత సినిమాల్లో ఒక బిగ్ ప్లాట్ఫామ్ చేరుకోవడానికి లవ్‌స్టోరీ వుంటుంది. కథలో ఒక చిన్న భాగంగా ఉంటుంది. కానీ ఈ సినిమాలో లవ్‌స్టోరీనే మెయిన్ ప్లాట్ ఫామ్.ఈ మొత్తం సినిమాకి లవ్‌స్టోరీయే కారణం.
ఒక లవ్‌స్టోరీలో యాక్షన్ చూడ్డానికి వెళ్తే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక యాక్షన్ సినిమాలో లవ్ చూడడానికి వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఇందులో ఎమోషన్స్ అన్నీ ఆర్గానిక్‌గా ఉంటాయి. ఒకరోజు ఒక విజువల్ మెటాఫర్ నా మైండ్‌లోకి వచ్చింది. ‘ఒక బిజీ రోడ్డుపైన ఒక కాంక్రీట్ సిమెంట్ ఫుట్ పాత్ క్రాక్ నుంచి ఒక చిన్న పువ్వు బయటికి వస్తే’…ఈ విజువల్ ఇమాజినేషన్ నుంచి ఈ కథ మొదలైంది. ఒక ఇంటెన్స్ యాంగర్ యాక్షన్ మధ్యలో మధ్యలో లవ్‌స్టోరీ తయారు చేశాం. చిన్నప్పుడు ఫంక్షన్‌లో డాన్స్ చేస్తున్నప్పుడు నువ్వు చాలా పొడుగ్గా ఉన్నావు డాన్స్ చేయొద్దు ఎవరో అన్నారు అప్పటినుంచి ఆ ఫీలింగ్ ఎలా ఉండిపోయింది. నాకు నేనే ఆ లిమిట్ పెట్టుకున్నాను. కానీ ఈ సినిమా కోసం ఆ లిమిటేషన్ దాటాను. ఇందులో హరి క్యారెక్టర్ నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను. తను మొహం మీద మాట్లాడే వ్యక్తి చాలా ఓపెన్‌గా ఉండే క్యారెక్టర్. ఈ పాత్ర కోసమే మదనపల్లి యాస ప్రాక్టీస్ చేసి చేసి ఇంట్లో కూడా మాట్లాడటం మొదలు పెట్టాను. నా యాస చూసి మా అమ్మ ‘ఏంటి ఇలా మాట్లాడుతున్నావ్’ అన్నారు (నవ్వుతూ).
లవ్‌స్టోరీలో యాక్షన్ ఉంటే?
- Advertisement -
- Advertisement -



