Saturday, August 22, 2026
E-PAPER
Homeక్రైమ్ధోతిగూడెం ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్

ధోతిగూడెం ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్

- Advertisement -

నవతెలంగాణ పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా ధోతిగూడెంలోని ఓ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో పేలుడు సంభవించింది.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకొని మంటలు అదుపు చేస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు, పేలుడు సమయంలో కంపెనీలో ఎంత మంది కార్మికులు ఉన్నారన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -