Saturday, August 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను కొట్టిచంపిన అత్తింటివారు..

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను కొట్టిచంపిన అత్తింటివారు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఔటర్‌ ఢిల్లీలోని లక్ష్మీ పార్కు ప్రాంతంలో కుటుంబ గొడవల నేపథ్యంలో భార్య కుటుంబ సభ్యుల దాడిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ వినయ్‌ గుప్తా (31) మృతి చెందాడు. శుక్రవారం ఉదయం భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తడంతో, భార్య తన పుట్టింటివారిని పిలిపించింది. చర్చల సమయంలో మాటామాటా పెరిగి వివాదం తీవ్రరూపం దాల్చడంతో వినయ్‌పై దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దాడికి పాల్పడిన నలుగురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -