Saturday, August 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నవాబ్‌పేట్‌-యన్మంగండ్ల రోడ్డుకు మరమ్మత్తులు

నవాబ్‌పేట్‌-యన్మంగండ్ల రోడ్డుకు మరమ్మత్తులు

- Advertisement -

నవతెలంగాణ-నవాబుపేట
నవాబ్‌పేట్‌-యన్మంగండ్ల మట్టిరోడ్డు పూర్తిగా అస్తవ్యస్తంగా మారినందున మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహ చారి, సర్పంచ్ గీతారాణి సుధాకర్ చారి, ఉపసర్పంచ్ హజహర్ అలీ వార్డు సభ్యులతో కలిసి శనివారం రోడ్డు మరమ్మతులు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బోనాలకు వెళ్ళే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రజల సౌకర్యాలకు అనుగుణంగా తమ పాలన కొనసాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మెండె శ్రీనివాస్, పుట్టి అంజయ్య, మల్లేష్ యాదవ్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -