Saturday, August 22, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ముధోల్ లో సీఎంఆర్ మాయం

ముధోల్ లో సీఎంఆర్ మాయం

- Advertisement -

రూ.16 కోట్ల 21 లక్షల 9874 విలువ గల ధాన్యం ఎగవేత
పోలీసుల అదుపులో రైస్ మిల్ యజమాని
నవతెలంగాణ – ముధోల్
నియోజకవర్గమైన ముధోల్ గల ఓ రైస్ మిల్ యజమాని రెండు సంవత్సరాల ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పకుండా ఏకంగా రూ.16 కోట్ల పైగా విలువగల ధాన్యాన్ని పక్కదారి పట్టించిన వైనం ఇది. స్థానికులు, అధికార వర్గాల సమాచారం మేరకు.. ముధోల్ గల ఓ రైస్ మిల్ కు 2023- 24, 2024- 25, సంవత్సరానికి గాను కలిపి  సూమారు 3131 టన్నుల సిఎంఆర్ ను రైస్ మిల్ యజమాని పక్కదారి పట్టించినట్లు సివిల్ సప్లై అధికారులు ఆలస్యంగా గుర్తించారు.

దీంతో శనివారం నిర్మల్ జిల్లా సివిల్ సప్లై డిఎం సంబంధిత రైస్ మిల్ యాజమానిపై పూర్తి వివరాలతో ముధోల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు‌. దీంతో రైస్ మిల్ యాజమానిని శనివారం ముధోల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయం ముధోల్ సిఐ రవీందర్ నాయక్ ను శనివారం రాత్రి నవతెలంగాణ ఫోన్లో వివరణ కోరగా సీఎంఆర్ పక్కదారి పట్టిన విషయం వాస్తవమేనన్నారు. రైస్ మిల్ యాజమాని సోమనాథ్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు‌. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఆదివారం తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -