నవతెలంగాణ-కుభీర్
మండలంలోని హల్ద గ్రామానికి చెందిన మచ్చర్ల మహేష్ (36) ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన శనివారం భైంసా మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కుభీర్ మండలంలోని బెల్గం ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మహేష్ భైంసా పట్టణంలో నివాసం ఉంటున్నాడు. ఇదిలా ఉండగా శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా పాఠశాలకు సెలవుదినం ఉండడంతో మహేష్ ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు.
రాత్రైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో చుట్టుపక్కల వెతికారు. అయినా ఎంతకీ అతడి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు మృతుడి ఫోన్ లొకేషన్ ఆధారంగా భైంసా మండలంలోని మాటేగా కుంటలో పడిపోయినట్టు గుర్తించారు. మహేష్ మృతి చెందిన విషయం తెలిసిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగారు. మరోవైపు దింతో పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకుని మహేష్ మృతదేహాన్ని స్వగ్రామమైన హల్దకు తీసుకెళ్లారు. అనంతరం గ్రామంలో మహేష్ అంత్యక్రియలు జరిపించారు. అయితే మహేష్ మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతుడికి భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.



