Saturday, August 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పంటలను పరిశీలించిన ఏఈవో సతీష్

పంటలను పరిశీలించిన ఏఈవో సతీష్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని చిన్న ఎడ్గి గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్ చిద్రవార్ శనివారం క్షేత్ర స్థాయిలో సోయాబీన్, ప్రత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్తి పంటలో రసం పీల్చే పురుగులైన తెల్ల దోమ, పచ్చ దోమ, పెనుబంక, తామర పురుగు ఉదృతి నివారణకు వేప నూనె (1500ppm) 500ml ఎకరాకు + ఫిప్రోనిల్ 200ml ఎకరాకు లేదా డైఫెంథియురాన్ 200 గ్రాములు లేదా ఫ్లూనోకామిడ్ (ఉలల) 60 గ్రాములు 200లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలని సూచించారు.

సోయాబీన్ పంటలో ప్రధానంగా పచ్చ పురుగు, కాండపు పురుగు ( Stem girdle) గమనించి దాని నివారణకు ఏమమెక్టిన్ బెంజోయేట్ ( EM 1) 100 గ్రాములు ఎకరాకు ఉదృతి ఎక్కువగా ఉన్నపుడు ఫ్లుబెండిమిడ్ ( Takumi) 100గ్రాములు ఎకరాకు లేదా క్లోరొంత్రినిప్రోల్ + లాంబ్డా స్యహలోత్రిన్ ( Ampligo) 100ml ఎకరాకు+13.0.45@1kg ఎకరాకు పిచికారి చేయాలని చెప్పారు. ఆకుమచ్చ తెగులు నివారణకు Mancozeb & Carbendizum (Saaf) 400గ్రాములు ఎకరాకు లేదా Propiconazole ( టిల్ట్) 200ml ఎకరాకు 200 లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు.

కంది పంటలో ప్రధానంగా ఎండు తెగులు గమనించి దాని నివారకు కాపర్ ఆక్స్ క్లోరైడ్ COC 3 గ్రాములు లీటరు నీటికి అనగా 600 గ్రాములు ఎకరాకు + 13.0.45@ 1kg ఎకరాకు కలిపి పిచికారి చేస్తే ఫలితం తెలుస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఈఓతో పాటు రైతు సోదరులు బోర్గావే బాలాజీపటేల్, చాకలియాదు, బస్గొండ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -