బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ‘యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్ 2026 – సీజన్ 2’ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. ఈ సందర్బంగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను శనివారం ఎఫ్‌డీసీ ఎండీ జి. ముకుంద రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రెయేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా, ఎఫ్‌డీసీ ఈడీ కిషోర్ బాబులతో కలిసి ఆవిష్క రించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, కళారూపాలపై షార్ట్ ఫిలిం, పాటల పోటీలు ఉంటాయన్నారు. ఈసారి కొత్తగా జానపద పాటలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ఇన్‌ఫ్లుయెన్సర్ల వీడియోస్, వ్యాసాలు (ఆర్టికల్స్) కు చోటు కల్పించారు. ఈ పోటీ యువ ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా మాట్లాడుతూ ఈ పోటీలు యువతకు భవిష్యత్తులో సినీ రంగంలో అవకాశాలను సృష్టిస్తాయని, సృజనాత్మక కంటెంట్‌కు వేదికగా నిలుస్తాయని తెలిపారు. అలాగే ప్రభుత్వ పథకాలకు మంచి దృశ్య రూపాన్ని కూడా ఇస్తాయన్నారు. లఘు చిత్రాల నిడివి 3 నిమిషాలు, పాటల రన్‌టైమ్ 5 నిమిషాలకు మించకూడదు. ఆయా వీడియోలు 4కే రిజల్యూషన్ కలిగి ఉండాలి. ఆసక్తి కలిగిన వారు వాటిని సెప్టెంబర్ 15లోపు సమర్పించాలి. ఈ పోటీలలో ప్రథమ బహుమతి రూ.3 లక్షలు, ద్వితీయ బహుమతి రూ.2 లక్షలు, తృతీయ బహుమతి రూ. లక్ష. మరో ఐదుగురికి కన్సోలేషన్ బహుమతిగా రూ.20 వేల చొప్పున అందించ నున్నారు. ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు ప్రదానం చేస్తారు.
సీజన్ 2 పోస్టర్ విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



