సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మహేంద్రగిరి నేపథ్యంగా, వారాహి మాత డివైన్ పవర్ చుట్టూ సాగే కథతో రూపొందుతోంది. ఈ చిత్రంలో మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘వాట్ ఏ లాజిక్ సర్ జీ’ పాటను లాంచ్ చేశారు. హీరో సుమంత్ మాట్లాడుతూ,‘మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీరు ఎంత సౌండ్ చేస్తున్నారో, సెప్టెంబర్ 11న మా ‘మహేంద్రగిరి వారాహి’ సినిమాతో అంత సౌండ్ చేయాలని కోరుకుం టున్నాం. ఈ సినిమాలో కథ, నా పెర్ఫార్మెన్స్ చాలా ప్రత్యేకంగా, వేరే కోణంలో ఉంటాయి. ఇది ఒక డివోష నల్ థ్రిల్లర్. ‘కాంతారా’, ‘కార్తికేయ’, ‘విరూపాక్ష’ లాంటి సినిమాలు ఎంతో పెద్ద విజయాలు సాధించాయి. అలాంటి సినిమాల జాబితాలోకి ఈ సినిమా కూడా చేరుతుందని నమ్ముతున్నాను’ అని అన్నారు. ‘తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది’ అని డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి చెప్పారు. ప్రొడ్యూసర్ మధు మాట్లాడుతూ,‘ఇది మీ అందరూ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. తప్పకుండా ఫ్యామిలీతో కలిసి వెళ్లండి. చాలా ఎంజాయ్ చేస్తారు’ అని తెలిపారు. ‘ఇది మంచి డివోషనల్ సినిమా. సెప్టెంబర్ 11న ఈ సినిమా వస్తోంది. అందరూ మీ ఇంట్లో వాళ్లను కూడా తీసుకెళ్లి ఈ సినిమాని థియేటర్‌లో చూడండి. సక్సెస్ మీట్‌లో మళ్లీ మీతో కలవాలని కోరుకుంటున్నాను’ అని వంశీ చాగంటి అన్నారు. ఈ సినిమాకి దర్శకత్వం: సంతోష్ జాగర్లపూడి, నిర్మాతలు: కలిపు మధు, లక్ష్మణ్, సంగీతం: అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రాఫర్: ప్రతాప్ ఆర్ కృష్ణ, ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ, ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ ఆర్ట్స్.
అద్భుత డివోషనల్ థ్రిల్లర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



