Saturday, August 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'కాకా'గా మెగాస్టార్‌

‘కాకా’గా మెగాస్టార్‌

- Advertisement -

హీరో చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో వెంకట్ కే నారాయణ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఓ భారీ సినిమాని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ సినిమాకి ‘కాకా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు.కె. సత్యం, సూపర్‌వైజర్‌గా చిరం జీవి ఆక్వా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతో గ్లింప్స్ ప్రారంభమవు తుంది. చెన్నై టీమ్‌కు ఫోన్ చేసి లోడ్ సమయానికి వస్తుందని చెబుతూ అందరినీ పలకరిస్తారు. సునీల్ లీవ్ అడగగా, తమ టార్గెట్ ఫెస్టివల్ అని చెప్పి లీవ్‌ను తిరస్కరి స్తారు. గెటప్ శ్రీను స్కూటర్ కీస్ గురించి చెప్పగా సత్యం వాటిని విసరమని చెబుతారు.ఆ కీస్ అనుకోకుండా నీటిలో పడిపోతాయి. అయితే ఓ కుక్క ఒక రిమోట్ తీసుకొస్తుంది. దానితో మాగ్నెట్ సాయంతో కీస్‌ను బయటకు తీస్తారు. ఆసక్తికరంగా.. కీస్‌తో పాటు గన్స్ కూడా బయటకు వస్తాయి. ఆ తర్వాత కళ్లద్దాలు పెట్టుకున్న చిరంజీవిని చూపిస్తూ ‘కాకా’ టైటిల్‌ను రివీల్ చేయడం ఆదరిపోయింది. ఫ్లాష్‌ బ్యాక్‌లో యంగ్, స్టైలిష్ చిరంజీవి గన్ ఫైరింగ్ సీక్వెన్స్‌తో కనిపిం చడం గ్లింప్స్‌కు మాస్ టచ్ ఇచ్చింది. ‘కాకా’ టైటిల్ పవర్‌ ఫుల్‌గా ఉంది. టైటిల్ గ్లింప్స్ కూడా స్ట్రైకింగ్ విజువల్స్, డిఫరెంట్ సెటప్‌తో వెంటనే ఆకట్టుకుంటుంది. చిరంజీవిని అభిమానులకు, మాస్ ఆడియన్స్‌కు బలంగా కనెక్ట్ అయ్యేలా ప్రజెంట్ చేయడంలో బాబీ కొల్లి మరోసారి తన మార్క్ చూపించారు. రెండు విభిన్నమైన లుక్స్‌ను చూపించిన విధానం, పవర్‌ఫుల్ విజువల్స్, మ్యూజిక్, గ్లింప్స్‌ను ఆసక్తికరంగా మార్చాయి.చిరంజీవి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మెస్మరైజ్ చేశారు. బాబీ మెగా స్టార్‌ను రెండు విభిన్నమైన లుక్స్‌లో ప్రజెంట్ చేశారు. 2027 జనవరి 13న సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -