Saturday, August 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసమ్మక్క–సారలమ్మ కథ ఆధారంగా పాన్-ఇండియా సినిమా

సమ్మక్క–సారలమ్మ కథ ఆధారంగా పాన్-ఇండియా సినిమా

- Advertisement -

ప్రముఖ నిర్మాణ సంస్థ మాస్ట్రో క్రియేషన్స్ తెలంగాణ ఆరాధ్య వన దేవతల సమ్మక్క–సారలమ్మ వీరగాథ నిజ జీవిత చరిత్ర ఆధారంగా భారీ బడ్జెట్ పాన్-ఇండియా చారిత్రాత్మిక చిత్రాన్ని రూపొందింస్తున్నారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, వీరత్వం మరియు భావోద్వేగాలను అద్భుతమైన విజువల్ అనుభూతిగా మార్చే లక్ష్యంతో ఈ చిత్రం రూపొందుతోందని చిత్ర దర్శకుడు వెంకట్ తెలిపారు. విజువల్ ఎఫెక్ట్స్, ప్రీ-విజువలైజేషన్, వర్చువల్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ వంటి కీలక విభాగాల కోసం యుకే, యుఎస్‌ వంటి దేశాల్లోని ప్రముఖ స్టూడియోలతో సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. ఈ తరహా సినిమా గతంలో రాలేదని కచ్చితంగా చెప్పగలను. సమ్మక్క-సారలమ్మ వీరగాథను ఈ తరానికి కూడా అర్థమయ్యేలా ఈ సినిమా ఉంటుంది. సకుటుంబ సపరివార సమేతంగా ఈ సినిమాని చూసేలా ఉంటుంది. ప్రతిష్ఠాత్మక నటీనటులను ఎంపిక చేసి, రాబోయే సమ్మక్క–సారలమ్మ మహా జాతర సమయానికల్లా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రణాళిక చేస్తున్నారని ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -