ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు పెన్ మూవీస్, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్.. ఆర్వీ స్టూడియోస్‌తో కలిసి ‘మహావీర్ కర్ణ’ అనే ఎపిక్ హైబ్రిడ్ లైవ్ యాక్షన్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జయంతీలాల్ గడా సమర్పిస్తున్నారు. కమర్షియల్‌గా సక్సెస్ అయిన ‘రాక్షసుడు’, ‘ఖిలాడీ’ వంటి డిఫరెంట్ జోనర్ మూవీస్‌తో తన దైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్నారు. మహాభారతంలోని చిరస్మర ణీయమైన కర్ణుడి కథను ఆధారంగా చేసుకుని ‘మహావీర్ కర్ణ’ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని రమేష్ వర్మ ఓ వినూత్నమైన హైబ్రిడ్ లైవ్ యాక్షన్ ఫార్మాట్లో రూపొందించనున్నారు.
లైవ్ పెర్ఫార్మెన్స్‌లోని భావోద్వేగ బలాన్ని, అత్యా ధునిక విజువల్ ఎఫెక్ట్స్ అందించే అపారమైన అవకాశాలను కలిపి ఈ చిత్రాన్ని సరికొత్త అనుభూతిని అందించేలా రూపొందిస్తున్నారు.
ఈ ప్రయోగాన్ని మరింత ఆసక్తికరంగా మార్చే అంశం కర్ణుడి కథనే ఈ చిత్రానికి భావోద్వేగ కేంద్రంగా ఎంచుకోవడం. కర్ణుడి కథ కేవలం కీర్తి కోసం పోరాడిన ఓ యోధుడి కథ మాత్రమే కాదు.. అన్నింటికంటే ఎక్కువగా తన మాటకే విలువ ఇచ్చిన ఓ మహా వీరుడి కథ. లేటెస్ట్గా ‘మహావీర్ కర్ణ’కు సంబంధించిన టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. భారీ స్కేల్లో రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 4న పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ సినిమాకి డైలాగ్స్: శ్రీమణి.
వినూత్నంగా ‘మహావీర్ కర్ణ’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



