రవితేజ హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై అద్భుతమైన రెస్పాన్స్‌తో, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో ఘన విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ చెన్నైలో హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. రవితేజ మాట్లాడుతూ,‘నాకు తమిళ్ సినిమాతో చాలా అనుబంధం ఉంది. నటుడిగా సినిమా పరిశ్రమలో నా ప్రయాణం ఇక్కడి నుంచే మొదలైంది. ప్రొడక్షన్ డిజైనర్ సురేష్, డీఓపీ విష్ణు, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ అద్భుతమైన వర్క్ ఇచ్చారు. ఈ సినిమా థియేటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. క్లైమాక్స్‌లో జీవీ ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్ ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. ఇది హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్. నక్షత్ర ఫ్యూచర్‌లో ఇంకా పెద్ద స్టార్ అవుతుంది. ప్రియా చాలా సహజంగా నటించింది. మా నిర్మాతలు రవి, నవీన్ నాకు చాలా మంచి స్నేహితులు. నేను ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లోనే సక్సెస్ మీట్‌లో మాట్లాడ తానని చెప్పాను. ఎందుకంటే ఈ సినిమా మీద మాకు మొదటి నుంచి అంత నమ్మకం ఉంది. సక్సెస్ మీట్ తమిళనాడులో కూడా ఉండాలని కోరుకున్నాను. మా డైరెక్టర్ శివ సినిమా అద్భుతంగా తీశాడు. తప్పకుండా అందరూ థియేటర్‌కు వెళ్లి సినిమా చూడండి. కచ్చితంగా ఈ సినిమా ఇష్టపడతారు. ఈ సినిమాని మీతో పాటు మనసులో పెట్టుకుంటారు.
మనసుల్లో నిలిచిపోయే సినిమా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



