- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాలోని ఫ్లోరిడాలో 23 ఏండ్ల యువ పైలట్ ఫెయిత్ టెన్‌క్లే సమయస్ఫూర్తితో పెను ప్రమాదాన్ని తప్పించారు. ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో కూలిపోతున్న చిన్న విమానాన్ని బోకా రాటన్ బీచ్‌లోని జనసమూహం, భవనాలను తప్పించి అట్లాంటిక్ సముద్రంలో సురక్షితంగా దించారు. అనంతరం ఆమె ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ప్రమాదంలో ఎలాంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు, అత్యవసర సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.
- Advertisement -



