నవతెలంగాణ -మెదక్ ప్రాంతీయ ప్రతినిధి : అయితే ఈ కేసులో నిందితురాలైన సురేఖ (25) తాజాగా జైలు నుంచి విడుదలై మళ్లీ అదే మత్తు మందు ఇంజక్షన్ సొంతంగా ఇచ్చుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సంగారెడ్డి పట్టణంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.
చేసిన పాపానికి కుమిలిపోయి ఆత్మహత్య..
వికారాబాద్ జిల్లా బట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన నక్కల సురేఖ(25) ఎన్ఐటి చేసి గత కొద్ది నెలలుగా సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తుంది. అయితే గత జనవరి 2026న తన ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు నిరాకరించడంతో కన్న తల్లిదండ్రులైన లక్ష్మీ, దశరథంలను ఆమె మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చంపేసింది. ఈ కేసులో ఆమె నిందితురాలిగా తేలింది. దీంతో కోర్టు ఆమెకు శిక్ష విధిస్తూ చంచల్ గూడ జైలుకు తరలించారు.
కాగా, జైలు నుంచి ఈ జూలై 31న ఆమె బెయిల్ పై విడుదలయింది. అయితే సొంత ఊరికి వెళితే ఊర్లో మొహం చూపించుకునే పరిస్థితి లేకపోవడంతో ఆమె తిరిగి సంగారెడ్డి పట్టణంలో ఓ ప్రైవేటు హాస్టల్ లో ఉంటూ ఉద్యోగం కోసం వెతుకుతోంది. ఇదే తరుణంలో ఈ నెల 23న సాయంత్రం 6.30 ప్రాంతంలో మత్తు మందు ఇంజెక్షన్ ఇచ్చుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
మృతురాలు సురేఖ సోదరుడు అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ రాము నాయుడు తెలిపారు.
ప్రియుడి కోసం కన్నవారినే చంపిన యువతి..బెయిల్ పై వచ్చి హాస్టల్లో దారుణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



