- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పార్టీ సీనియర్ నాయకులు, కిసాన్ సభ అఖిల భారత నాయకులు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి భౌతికకాయాన్ని సోమవారం (ఆగస్టు 25) ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎంబీ భవన్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. ఉదయం 11 గంటలకు ఎంబీ భవన్ నుంచి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వరకు అంతిమయాత్ర నిర్వహించనున్నారు. అనంతరం సారంపల్లి మల్లారెడ్డి భౌతికకాయాన్ని గాంధీ ఆస్పత్రికి అప్పగించనున్నారు.
- Advertisement -



