Monday, August 24, 2026
E-PAPER
Homeజాతీయంఢిల్లీలో విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం

ఢిల్లీలో విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: వర్షాల కారణంగా ఢిల్లీలో విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఢిల్లీ విమానాశ్రయంలో దిగాల్సిన 15 విమానాలను అధికారులు అత్యవసరంగా ఇతర నగరాలకు దారి మళ్లించారు. జైపూర్ 12, చండీగఢ్ రెండు, లక్నో ఒక విమానాన్ని దారి మళ్లిచంగా.. ట్రాఫిక్ నియంత్రణ, ప్రతికూల వాతావరణం వల్ల విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌లలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో పలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ మేరకు ఢిల్లీ పరిసర ప్రాంతాలకు వాతావరణ శాఖ ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. ప్రయాణికులు తమ విమాన సమయాల గురించి సంబంధిత ఎయిర్‌లైన్స్ సంస్థలను సంప్రదించి బయలుదేరాలని అధికారులు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -