Monday, August 24, 2026
E-PAPER
Homeజాతీయంకర్నాటకలో అధికార, ప్రతిపక్ష పార్టీల ధర్నాలు

కర్నాటకలో అధికార, ప్రతిపక్ష పార్టీల ధర్నాలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: కర్నాటకలో అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటా పోటీగా ధర్నాలు చేపట్టాయి. మంత్రి బి. నాగేంద్ర రాజీనామా చేయాలంటూ బీజేపీ శ్రేణులు బెంగళూరులోని విధాన సౌధ ఎదుట నిరసన చేపట్టారు. ఈక్రమంలో వారికి పోటీగా అధికార పక్షం కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఇరు పక్షాల నేతలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. ఈ నిరసన సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు కర్ణాటకకు చెందిన ప్రముఖ బీజేపీ మరియు జేడీ(ఎస్) నాయకుల ముఖచిత్రాలు కలిగిన మాస్కులను ధరించారు.

“బీజేపీ అవినీతితోనూ, అవినీతిపరులైన నాయకులతోనూ నిండిపోయింది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చూస్తే, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ముఖ్యమంత్రులు కనిపిస్తారు. అయినప్పటికీ వారికి పదవులు దక్కుతున్నాయి, వారు రాష్ట్రాలను పాలిస్తూనే ఉన్నారు. కాబట్టి, వారిని ప్రశ్నించాల్సింది పోయి, కర్ణాటకలోని బీజేపీ ఎమ్మెల్యేలు మా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. నాగేంద్ర అప్పటికే రాజీనామా చేశారు.” కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -