నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
ప్రజావాణిలో స్థానిక ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని మండల బీజేపీ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ మండలాధ్యక్షుడు మల్లయ్యల సుభాష్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంలో నిరుపేదలకు ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్‌లకు జుక్కల్ ఎమ్మెల్యే ఇండ్ల పట్టాలిచ్చినా.. ఇంటి నెంబర్లు కేటాయించకపోవడంతో ఇబ్బందిపడుతున్నారని అన్నారు. మండల కేంద్రంలో 464, 337, 73 సర్వే నంబర్లలో గత కొన్నేండ్లుగా పేదలు భూమిని సాగుచేస్తున్నారనీ, వారికి పట్టాలివ్వలేదనీ, అదేవిధంగా పోచారం గ్రామానికి వస్తున్న బస్సును అంజనీ, శివపూర్, తలాబ్ తండా మీదగా వెళ్లేటట్లు చేసి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. పై విషయాలపై నాయకులు సోమవారం ప్రజావాణిలో అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. బీజేపీ నాయకులు తానాజీ రావు పటేల్, నవీన్ గౌడ్ ,అశోక్, దర్బార్ పాల్గొన్నారు.
ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



