Sunday, September 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థిని సన్మానించిన ఎంపీడీఓ

ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థిని సన్మానించిన ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండల పరిధిలోని పడంపల్లి గ్రామానికి చెందిన వెంకట్ సాయివిష్ణు ఎంబీబీఎస్‌లో సీటు సాధించిన సందర్భంగా జుక్కల్‌ ఎంపీడీఓ శ్రీనివాస్‌ ఆదివారం విద్యార్థిని కలిసి అభినందించారు. ఈ క్రమంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. జుక్కల్‌ లోని గ్రామీణ ప్రాంత విద్యార్థి ఎంబీబీఎస్‌ లో సీటు సాధించడం మండలానికే గర్వకారణమన్నారు. ఎంబీబీఎస్ లో సీటు సాధించి పేద ప్రజలకు ఆరోగ్యంగా ఉండేందుకు సేవలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు ఎంపీఓ రాము, పెద్ద ఏడ్గి సర్పంచ్ అస్పత్ వార్ అనీల్ కూమార్, సూపరిండెంట్ క్రాంతి కుమార్, ఎంపీడీవో సిబ్బంది సీనియర్ అసిస్టెంట్ మధు, జూనియర్ అసిస్టెంట్ గంగాధర్, జుక్కల్ మండల జిపి కార్యదర్శుల సంఘం అధ్యక్షులు రమేష్ చారి, కార్యదర్శులు అనురాధ, స్రవంతి, వికాస్ రెడ్డి, నాగయ్య, శ్రీనివాస్ గౌడ్, ఎఫ్ ఏ జాదవ్ మారుతి, సీఓ భూమా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -