- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలం గుల్ల తండా మాజీ సర్పంచ్ దేవిదాస్ తుకారాం సతీమణి వారం క్రితం మృతి చెందారు. విషయం తెలుసుకున్న జుక్కల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే గుల్ల తండాలోని వారి నివాసానికి వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, వారికి మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



