నవతెలంగాణ – జుక్కల్
మండల పరిధిలోని పడంపల్లి హమానికి చెందిన వెంకట సాయివిష్ణు ఇటీవలే నీట్ పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించి ఎంబీబీఎస్ సీటు సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జుక్కల్ ఎస్సై మురళి విద్యార్థిని శాలువాతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో విద్యా కుసుమాలు ఉంటాయనీ, ఒకే కుటుంబంలో అన్నా చెల్లెలు ఒకరు ఎంబీబీఎస్ లో సీటు సాధించగా.. చెల్లెలు ఎన్ఐటి శ్రీనగర్ బీటెక్ ఈసీఈ బ్రాంచ్ లో సీటు సాధించడం గొప్ప విషయమన్నారు. జుక్కల్ మండల పరిధిలోని మారుమూల గ్రామాలలో ప్రతిభ కలిగిన విద్యార్థులు ఉండడం మనకెంతో గర్వకారణమన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉత్తమమైన విద్యను అందించినప్పుడు మెరుగైన విజయాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలుస్తారని కొనియాడారు.
ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థిని సన్మానించిన ఎస్సై
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



