Monday, August 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీసీరోడ్లు నిర్మించాలని ప్రజావాణిలో వినతి

సీసీరోడ్లు నిర్మించాలని ప్రజావాణిలో వినతి

- Advertisement -

నవతెలంగాణ-రాజోలి
రాజోలి మండల కేంద్రంలో ప్రజావాణి నిర్వహిస్తున్న తహసిల్దార్ రామ్మోహన్, ఎంపీడీవో అబ్దుల్ సయ్యద్ లకు కొత్త రాజోలిలో నివసిస్తున్న కాలనీవాసులకు సిసి రోడ్లు వేయాలని కెవిపిఎస్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం వినతి పత్రమందజేశారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు విజయకుమార్ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో అడపాదడపా కురిసిన వర్షాల మూలంగా కొత్త రాజోలి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కస్తూర్బా పాఠశాలకు వెళ్లాలంటే నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. సీసీ రోడ్లు జనసంచారం లేని చోట వేశారనీ, తక్ష‍ణమే జనావాసాల మధ్య సీసీరోడ్లు నిర్మించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కస్తూరిబాకు పిల్లలను తీసుకొచ్చే క్రమంలో బురదరోడ్డుతో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, ప్రజలు తిరిగే కాలనీలలో, బడులకు వెళ్ళే దారుల్లో సీసీరోడ్లు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో కెవిపిఎస్ మండల నాయకులు సుందరాజు, గిద్దన్న, పెద్దింటి నాగరాజు, గౌండరాజు పాల్గొన్నారు. అనంతరం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్న కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -