నవతెలంగాణ-హైదరాబాద్: స్కూల్ టీక్ కరో పేరుతో కాక్రోచ్ జనతా పార్టీ దేశ వ్యాప్త సంచారం చేపట్టిన విషయం తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ స్కూళ్లలను సందర్శిస్తున్న సమయంలో సీజేపీ ప్రతినిధలపై బీజేపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నారు. ఈక్రమంలో సీజేపీ అధినేత అభిజిత్ దీప్కే అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులకు బహిరంగ లేఖలు రాశారు. సర్కార్ బడుల్లో చేపట్టిన మౌలిక వసతుల కల్పన, మరుగుదొడ్లు, సురక్షితమైన తాగునీరు, సరైన తరగతి గదులు, బెంచీలు వంటి సౌకర్యాలపై సమగ్ర వివరాలు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్వాతంత్య్రం వచ్చి దాదాపు ఎనిమిది దశాబ్దాలైనా దేశంలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఇప్పటికీ సరైన మౌలిక వసతుల కల్పన వెనుకబడి ఉన్నామని ఆయన విమర్శించారు.
విద్యాశాఖ మంత్రులకు సీజేపీ బహిరంగ లేఖలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



