Monday, August 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మైనార్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే తోట ప్రమాణ స్వీకారం

మైనార్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే తోట ప్రమాణ స్వీకారం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్‌
తెలంగాణ శాసనసభలో మైనారిటీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో బాధ్యతలు స్వీకరించారు. మైనారిటీల సంక్షేమం, హక్కుల పరిరక్షణతో పాటు వారి సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ , శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని తోట లక్ష్మీకాంతారావుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -