- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య తన ప్రవర్తనతో వివాదంలో చిక్కుకున్నాడు. ఔటైన తర్వాత ఆగ్రహంతో ప్రవర్తించినందుకు అతడిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చర్యలు తీసుకుంది. అతడిని అధికారికంగా మందలించడంతో పాటు, ఒక డీమెరిట్ పాయింట్‌ను ఖాతాలో చేర్చింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2ను జయసూర్య ఉల్లంఘించినట్లు ఐసీసీ నిర్ధారించింది. అంతర్జాతీయ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ పరికరాలను, మైదానంలోని వస్తువులను దుర్వినియోగం చేయడం ఈ నిబంధన కిందకు వస్తుంది.
- Advertisement -



