Tuesday, August 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలుజీవో 77పై సీఎంకి థియేటర్ల యజమానుల లేఖ

జీవో 77పై సీఎంకి థియేటర్ల యజమానుల లేఖ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో సినిమా టికెట్ ధరల నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 77పై వివాదం ముదురుతోంది. ఈ జీవో ఏకపక్షంగా ఉందని, కేవలం నిర్మాతలకు మేలు చేసేలా రూపొందించారని ఆరోపిస్తూ తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. స్టేట్ ఫిల్మ్ ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ వంటి కీలక భాగస్వామ్య పక్షాలను సంప్రదించకుండా, కేవలం తెలుగు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. టికెట్ ధరల పెంపు వల్ల ఎగ్జిబిటర్లకు ఎటువంటి లాభం లేదని, థియేటర్ల నిర్వహణ, సిబ్బంది వేతనాలు, విద్యుత్ బిల్లులు వంటి ఆర్థిక భారాలన్నింటినీ తామే భరిస్తున్నామని వారు స్పష్టం చేశారు. కరోనా అనంతర కాలంలో ప్రేక్షకులకు మెరుగైన అనుభూతిని అందించేందుకు గత మూడేళ్లలో సుమారు రూ. 300 కోట్లు వెచ్చించి థియేటర్లను ఆధునికీకరించామని, అయితే ప్రస్తుత నిబంధనల వల్ల టికెట్ ధరలను నిర్ణయించే హక్కును కూడా కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -