Tuesday, August 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలువారిపై చర్యలు ఉంటాయి: మల్లు రవి

వారిపై చర్యలు ఉంటాయి: మల్లు రవి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డిపై పూర్తి అంశాలతో నివేదికను పొందుపరిచి టీ పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్‌కు అందజేశామని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పష్టం చేశారు. దీనిని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌కు పంపారని తెలిపారు. మంగళవారం హైదరాబాద్ గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ..గత విషయాలను కూడా పరిగణలోకి తీసుకున్నామని వివరించారు. ఈ నివేదికను ఏఐసీసీ చీఫ్, పార్టీ జనరల్ సెక్రటరీకి కూడా పంపిస్తారని అన్నారు. కాంగ్రెస్ హై కమాండ్ ఆదేశాల మేరకు వారిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో నాయకులు, క్యాడర్‌కు ఒక మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నామని మల్లు రవి తెలిపారు. పార్టీపై నెగెటివ్ అభిప్రాయాన్ని కలిగించకుండా ఉండాలంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -